- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత వివేక్ సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ త్వరలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయనే స్వయంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా స్పష్టత ఇచ్చారు. పార్టీ మారాలన్న ఉద్దేశం లేదని, అదంతా టీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, పథకం ప్రకారం చేస్తున్న దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని, పార్టీ మారే ప్రసక్తే లేదని, బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
కేసీఆర్ కుటుంబ అవినీతిని తాను ప్రశ్నిస్తున్నానని, దానికి కౌంటర్‌గా తనను టార్గెట్ చేస్తున్నారని, తన ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కోరడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్ సైతం ఆయన ఆస్తులపై అదే సీబీఐ దర్యాప్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారా అని వివేక సవాలు విసిరారు. “టీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు నేను పార్టీ మారతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్ ప్రోద్బలం ఉందని నాకు కచ్చితమైన సమాచారం ఉంది. కేసీఆర్ కుటుంబ ఫాలన అంతానికే నేను బీజేపీలో చేరాను. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా నా టార్గెట్‌ను కొంత మేరకు సాధించాను. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను మట్టి కరిపించడమే నా తదుపరి లక్ష్యం” అని వివేక్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.