ఎస్వీబీసీ ఛానల్‌‌పై బీజేపీ ఫైర్

by srinivas |
ఎస్వీబీసీ ఛానల్‌‌పై బీజేపీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం జరిగిన భూమి పూజను యావత్ హిందూ సమాజం వీక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే, విష్ణువు దశావతారాల్లో ఒకరైన శ్రీ వెంకటేశ్వరుడికి చెందిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదు. దీనికి సంబంధించి టీటీడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం జగన్ విశాఖ శారదాపీఠానికి వెళితే ప్రసారం చేశారని.. అయోధ్య రాముడి కార్యక్రమాన్ని ఎందుకు వదిలేశారని బీజేపీ సూటిగా ప్రశ్నించింది. ఈ అంశంపై జగన్ వెంటనే స్పందించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

దాంతో టీటీడీ యాజమాన్యం వెంటనే స్పందించింది. ప్రతిరోజూ తిరుమలలో స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుందని తెలిపింది. అయోధ్య భూమిపూజ సమయంలో కల్యాణం జరుగుతోందని.. ఆ సమయంలో శ్రీవారి కళ్యాణాన్ని ప్రసారం చేసినట్లు వివరించింది. అయోధ్య భూమిపూజకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story