‘కేసీఆర్ మాటల్లోనే హిందువు.. ఎంఐఎంకు బంధువు’..!

by Shyam |
‘కేసీఆర్ మాటల్లోనే హిందువు.. ఎంఐఎంకు బంధువు’..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో తరచుగా భద్రాద్రి ఆలయం గురించి ప్రస్తావిస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. అయోధ్య రామాలయాన్ని దేశ ప్రజలందరూ భక్తిభావంతో రామయ్య జన్మభూమిలో స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్నారని ఆమె గుర్తు చేశారు. కానీ, ఏపీలో కలిసిన మండలాలు వెనక్కి వస్తేనే భద్రాద్రిలో బ్రహ్మాండంగా నిర్మాణాల అభివృద్ధి చేపడతామని మంత్రులతో మెలికలు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖండించలేని సీఎం.. రామాలయానికి అనుకూలమా? కాదా? స్పష్టంగా ప్రకటన చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. మాటల్లోనే హిందువునని, అయోధ్య విషయంలో ఎంఐఎంకు అసలైన బంధువునని.. కేసీఆర్ చెబుతారో లేదో తేల్చుకోవాలని విజయశాంతి చురకలు వేశారు.

Advertisement

Next Story