పనిచేయని ముఖ్యమంత్రి మనకొద్దు: విజయశాంతి

by Shyam |
పనిచేయని ముఖ్యమంత్రి మనకొద్దు: విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్నివర్గాల ప్రజలు కొట్లాడి తెలంగాణను సాధించుకున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని, పనిచేసే ముఖ్యమంత్రి వస్తారనుకుంటే పనిచేయని ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చారని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. “నా దృష్టిలో కేసీఆర్ రాజకీయాల నుంచి ఎప్పుడో రిటైర్ అయిపోయారు. ఆయన సచివాలయానికి రావడం మానేసినప్పుడే పరిపాలన ఎలా ఉంటుందో అర్థమైంది. ప్రగతి భవన్‌కే పరిమితం కావడంతో పనిచేయని ముఖ్యమంత్రి అని తేలిపోయింది” అని విజయశాంతి అన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆమె మంగళవారం పై వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ నాశనమైందని, కరోనా కష్టకాలంలో ప్రజలను పలకరించని, బాధితులను పరామర్శించని ఆయన ఇప్పుడు వ్యాక్సినేషన్ సందర్భంగానూ అదే ధోరణిలో ఉన్నారని విజయశాంతి అన్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టుల గురించి వైద్యుల్లోనే గందరగోళం ఉన్న సమయంలో సామాన్యుల్లో మరింత ఎక్కువగా ఉందని, ప్రతీ ఒక్కరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారని ఆరోపించారు. ఫామ్ హౌజ్ నుంచి బైటకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని భావించానని, కానీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని, టీఆర్ఎస్ క్రింది స్థాయి నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed