- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ కేసీఆర్ దొరా ఇన్నాళ్లకు నిరుద్యోగులు గుర్తుకొచ్చారా
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ మరోసారి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీలో కమలం దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను ఆరేళ్లుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం ఆదరాబాదరాగా 50వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారని అన్నారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను ప్రభుత్వం పట్టించుకోలేదు. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయి. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదన్నారు. టీచర్ల ఏకీకృత సర్వీస్ అంశంలోనూ కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదన్న విజయశాంతి.., దీనివల్ల రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారని విజయశాంతి తనదైన స్టైల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.