- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాజధాని, ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నేత పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఆమె జాతీయ నాయకురాలో జాతి నాయకురాల్లో పూర్తిగా స్పష్టమైందన్నారు. విజయసాయి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ మాట్లాడుతూ… బీజేపీ కుల, మతాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అర్హతను చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా అని నిలదీశారు. అన్నింటినీ కులమయం చేసిన వైసీపీ… కులాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Next Story