ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తారా?

by Sridhar Babu |
ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తారా?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా సంక్షోభ సమయంలో గోళ్లపాడు ఛానెల్ విస్తరణ పేరుతో ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించాలని రెవెన్యూ సిబ్బంది నోటిసులు ఇవ్వడంపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన శుక్రవారం బస్తీవాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 ఫిబ్రవరి లో ఖమ్మంలో పర్యటించిన కేసీఆర్.. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించిన తరువాతనే ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు టీఆర్ ఎస్‌ నాయకులు విస్మరిస్తే ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. బాధితుల్లో అత్యధికులు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారేనని అన్నారు. ఈ ఘటనపై జాతీయ బీసీ క‌మిష‌న్ సభ్యుడు తల్లోజు ఆచారికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బస్తీవాసులకు ఇచ్చిన నోటీసు ప్రతిని శ్రీధర్ రెడ్డి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story