- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాస్టర్ ప్రవీణ్‌పై కేసు నమోదు కంటి తుడుపు చర్య
దిశ, వెబ్‌డెస్క్: హిందూ వ్యతిరేక వైఖరిని డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుసరిస్తున్నారా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆదివారం ఉదయం విశాఖలో సోము వీర్రాజు అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. డీజీపీ తన హోదాను అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల దాడులపై హిందువులను బాధ్యుల్ని చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రామతీర్థం వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై కేసు నమోదు కంటితుడుపు చర్యేనని సోము వీర్రాజు విమర్శించారు. ప్రజల డబ్బుతో పాస్టర్లకు వేతనాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మతమార్పిళ్లను ప్రోత్సహించేందుకే పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారా అంటూ నిలదీశారు. చర్చిల నిర్మాణాలు, రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రానికి నివేదిస్తామని పేర్కొన్నారు.