- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొద్దునిద్రలో శివసేన ప్రభుత్వం : సంబిత్ పాత్ర
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని శివసేన సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయాల్లో సైతం తీవ్రదుమారం రేపుతోంది. అయితే, సుప్రీం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సుశాంత్ కేసు విషయంలో ఇప్పటివరకు మొద్దునిద్రపోయిన మహా ప్రభుత్వం ఇప్పుడు గగ్గోలు పెడుతోందని సంబిత్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇన్నిరోజులు సుశాంత్ మరణంపై విచారణ జరిపించిన మహా ప్రభుత్వం ఎమీ కనిపెట్టలేకపోయిందని.. ఆ కేసును సుప్రీం సీబీఐకు బదిలీ చేస్తే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమీ చేయలేక, సుశాంత్ కుటుంబంపై శివసేన ఎంపీ విమర్శలకు దిగారని గుర్తుచేశారు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టిందనే వార్తను మనందరం వింటామని ఆయన జోస్యంచెప్పారు. ‘శివసేన అంటే నిద్రపోతున్న సేన’ అని ఎద్దేవా చేశారు. సుశాంత్ మరణంలో అసలు నిజాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వస్తాయని స్పష్టంచేశారు. సుప్రీం తీర్పు ఉద్ధవ్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కీలక వ్యాఖ్యలు చేశారు.