కన్నాను తీసేశారు.. సోమును పెట్టారు అనుకోవొద్దు

by Anukaran |
కన్నాను తీసేశారు.. సోమును పెట్టారు అనుకోవొద్దు
X

దిశ, వెబ్ డెస్క్: కన్నాను తీసేశారు.. సోమును పెట్టారు అనుకోవొద్దు.. కన్నాకు మరో బాధ్యత ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ నేత రాం మాధవ్ అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని, రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండాలన్నారు. మంచి చేస్తే అంగీకరించాలి.. తప్పు చేస్తే మాట్లాడాలన్నారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం రోల్ ఉండదని, దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో రాజధాని ఒక్కటే ఉందని రాం మాధవ్ అన్నారు. బీజేపీలో అంతా ప్రణాళిక ప్రకారం విధానాలు జరుగుతాయని, ప్రజా సమస్యలపై ఘర్షణ చేయాలి ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story