- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలిసిన పార్టీకి, బక్కపలుచని ప్రజలకు పోటీ
by Shyam |
X
దిశ దుబ్బాక: బలిసిన టీఆర్ఎస్ పార్టీకి, దుబ్బాక బక్కచిక్కిన నిరుపేదలకు మధ్య జరుతున్న పోటీ ఈ ఉప ఎన్నికలు అని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందనరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి ఓటేస్తే పింఛన్ కట్ చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావని ఓటర్లను టీఆర్‌ఎస్ నాయకులు భయపెడుతున్నారని ఆయన తెలిపారు. హరీశ్ రావు, పద్మ దేవేందర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తున్న హరీశ్ రావు కు ఉప ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పాలని కోరారు.
Advertisement
Next Story