వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలి

by Shyam |
వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలి
X

దిశ, దుబ్బాక : నారాయణఖేడ్‎లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలని చెప్పిన మంత్రి హరీష్ రావు.. దుబ్బాకలో వారసత్వ రాజకీయానికి ఎందుకు తెర లేపుతున్నారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డుల్లో రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. దళిత సీఎం, డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎన్నో హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ మరిన్ని హామీలిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన రామలింగారెడ్డి, ముత్యంరెడ్డి దుబ్బాకకు ఏమి చేశారని ప్రశ్నించారు. మళ్లీ వాళ్ల వారసులను గెలిపిస్తే ఏమి చేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే తనను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతును అవుతానని అన్నారు.

Advertisement

Next Story