- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భయంతోనే ఎన్నికలకు వెళ్తున్నారు: లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు ఆపటానికే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ ఓబీసి జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లోపే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని వెల్లడించారు. బీజేపీతో ఉన్న భయంతోనే నిర్ణీత గడువు కంటే ముందే గ్రేటర్ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నారని ఆయన చెప్పారు.
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే గ్రేటర్ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతున్నాయని లక్ష్మణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కరోనా, వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం ముక్త్ హైదరాబాద్ చేయడమే తమ ముందున్న గోల్ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.