- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల (GHMC Elections 2020) షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. అంతేగాకుండా రేపటి(బుధవారం) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపారు. అయితే తాజాగా దీనిపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ స్పందించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పోలింగ్ తేదీలను ఇవ్వడం, రాష్ట్రంలో అలవాటుగా మారిందని మండిపడ్డారు. అంతేగాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.