కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలి : కృష్ణ సాగర్

by Shyam |
కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలి : కృష్ణ సాగర్
X

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై మంత్రి కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలని, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యస్పదం, మోసపూరితం అని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు విమర్శించారు. కేటీఆర్ ఎంత మేధావో తెలంగాణ ప్రజలకు వారి వ్యాఖ్యలతో అర్థమవుతుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమేనని, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అసత్య ప్రచారాలను ఆయుధాలుగా వాడుకునే విధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆరేండ్లుగా రాష్ట్ర పన్నులవాట, కేంద్ర పథకాల నిధులు, లోన్లు, గ్యారంటీలతో కలిపి రూ.3లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఉదారంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఆర్థిక సాయం చేస్తుంటే కృతజ్ఞత చూపించాల్సిందిపోయి అసత్య ప్రచారం, తిట్ల పురాణం తిరిగి ఇస్తారా..?, కేటీఆర్ కామిక్ పుస్తకాలు చదవడం ఆపి రాజ్యాంగం చదవాలని సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్ల అని అన్నారు. భారతదేశం తీసుకున్న పాలసీల వల్ల రాష్ట్రాలకు ఇండస్ట్రీలు వస్తాయన్నారు. దక్షిణాదిలో బీజేపీ లేదు కాబట్టి అది జాతీయపార్టీ కదానడం మూర్కత్వం అని, ప్రభుత్వంలో ఉంటేనే పార్టీ ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో 19.45 ఓటు శాతం బీజేపీకి ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed