మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు

by srinivas |
మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడారని, డిక్లరేషన్ ఎవరు పెట్టారని మాట్లాడతారా అని విమర్శించారు. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరగ్గొడితే.. బొమ్మ చెయ్యి అన్నారని.. రథం దగ్ధం అయితే రూ.కోటితో చేయిస్తున్నామని మాట్లాడతున్నారన్నారు. వెంకన్నకు మనం ఎన్నో సేవలు చేస్తాం, వాటిని కూడా ప్రశ్నిస్తారా.. ఎంతో కాలంగా వస్తున్న ఆచార వ్యవహరాలను మార్చేస్తారా.. అని సోమువీర్రాజు ప్రశ్నించారు.

Advertisement

Next Story