- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృతి హాసన్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
చెన్నై: ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ కూతురు, సినీ తార శృతి హాసన్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఈరోజు ఫిర్యాదు చేసింది. దక్షిణ కొయంబతూర్‌లోని పోలింగ్ బూత్‌లోకి ఆమె అక్రమంగా ప్రవేశించారని
ఆరోపించింది. బూత్‌లోకి కేవలం పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.
కమల్ హాసన్, తన ఇద్దరు కూతుళ్లు చెన్నైలో మంగళవారం ఓటు వేశారు. తర్వాత అక్కడి నుంచి తాను పోటీచేస్తున్న దక్షిణ కొయంబతూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లకు కమల్ హాసన్, తన కూతురు శృతి కలిసి వెళ్లారు. ఓటర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. బీజేపీ గెలిస్తే డబ్బులు పంచుతారని ప్రలోభపెట్టినట్టు తెలిసిందని అనంతరం ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ పర్యటనలో శృతి హాసన్ కూడా ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. దీన్ని పేర్కొంటూ ఆమె చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నందకుమార్ బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.