ఓటు వేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు

by Anukaran |
ఓటు వేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు
X

దిశ, వెబ్‎డెస్క్ : దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు వేశారు. ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా నిరంతరం పోలింగ్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed