- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం: సోము వీర్రాజు
దిశ, ఏపీ బ్యూరో: ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా సోము వీర్రాజును తాడేపల్లిలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ హిందువుల పట్ల ప్రభుత్వం చులకన భావంతో ఉందన్నారు. దీన్ని సహించేది లేదని, ఇంకా ఆందోళనను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎమ్మెల్సీ మాధవ్‌తోపాటు పాటిబండ్ల రామకృష్ణ, కె.సైతారావును అరెస్టు చేశారు. గుంటూరు నగరంలో కన్నా లక్ష్మీనారాయణను, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణాన్ని వారి నివాసాల్లో నిర్బంధించారు. పలువురు కార్యకర్తల్ని అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.