కేసీఆర్‌ జైలుకెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

by Sridhar Babu |   ( Updated:2021-07-24 05:54:30.0  )
BJP chief Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. 71 శాతం ఓట్లతో ఈటల గెలుస్తాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ‘దళిత బంధు’ పథకం కింద పది మందికి ఇచ్చి.. వేరే వాళ్లకు ఇవ్వకుండా కోర్టుకు పంపిస్తారని, ఆ నిందను ప్రతిపక్షాలపై వేస్తారని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కాషాయమయం చేయడానికి ప్రతీ బీజేపీ కార్యకర్త పని చేస్తున్నాడని సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం అని తమ పార్టీ అధ్యక్షుడు నడ్డా తనకు చెప్పారని బండి సంజయ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed