- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బెంగాల్‌లో నలుగురిని కాదు.. ఎనిమిది మందిని చంపాల్సింది’
కోల్‌కతా: బెంగాల్ నాలుగో విడత ఎన్నికల్లో సీతల్‌కుచిలో చోటుచేసుకున్న హింసపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ” కేంద్ర బలగాలు నలుగురిని కాల్చి చంపడం సరైన చర్యే..నలుగురిని కాదు, ఎనిమిది మందిని చంపాల్సింది. అక్కడ ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులున్నందునే కేంద్రబలగాలు కాల్పులు జరిపాయి. 18 ఏళ్ల ఓ యువకుడు బీజేపీకి మద్దతు తెలుపుతుండగా కొందరు అతన్ని హతమార్చారు. ఆ దుండగుల నేత మమతా బెనర్జీ” అని హబ్రాలో సోమవారం ప్రచారం చేస్తూ బీజేపీ అభ్యర్థి రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు. “ఆ గూండాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. అందుకే కాల్పులు జరిగాయి. ఇలాంటి ఘటనలే పునరావృతమైతే, కేంద్ర బలగాలు మళ్లీ సమాధానమిస్తాయి” అని వార్నింగ్ ఇచ్చారు. సిన్హా వ్యాఖ్యలపై టీఎంసీ లీడర్, రాష్ట్ర మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ మండిపడ్డారు. బీజేపీ ఆటవిక, అనాగరిక, హింసాత్మక పార్టీ అని, ఎన్నికల సంఘం ఆ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన నలుగురిని నాటీ బాయ్స్ అని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలూ కలకలం రేపాయి. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే రాష్ట్రమంతటా ఇలాంటి ఘటనలు జరుగుతాయని నోరుపారేసుకున్నారు. ఘోష్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు చేసింది.