- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీపీఎల్ Vs ఐపీఎల్.. నరాలు తెగే ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు టీ20 మ్యాచ్‌లా నరాలు తెగే ఉత్కంఠను కలిగించాయి. ప్రస్తుతం నడుస్తోన్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉంటుందో అదే రేంజ్‌లో దుబ్బాక ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) ఫలితాలు రౌండ్ రౌండ్‌కూ మారాయి. ఇవాళ జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సైతం ఇలాంటి ఉత్కంఠ నెలకొంటుందో ఏమో తెలియదు కానీ… తెలుగు రాష్రాలు ఆసక్తిగా గమనించిన దుబ్బాక బైపోల్ ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి.
క్రికెట్‌లో చివరి బంతులకు కొట్టాల్సిన పరుగులను ఏవిధంగా లెక్కలు వేసుకుంటామో అదే రీతిలో రౌండ్ రౌండ్‌కు పార్టీల నేతలు, కార్యకర్తలు, టీవీల ముందు కూర్చొని చూసే వీక్షకులు అదే ఫార్ములాను ఫాలో అయ్యాయి. మొదటి నుంచి 19 రౌండ్ల వరకు ఓ విధమైన ఉత్కంఠను కలిగిస్తే 20 నుంచి 24 రౌండ్ల వరకు టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరీ తలపడ్డాయి. చివరి రౌండ్లలో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చిన బీజేపీ నేత రఘునందన్ రావు 1,118 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచి 21,819 ఓట్లను సాధించారు.