- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జల్లికట్టు.. ఉద్యోగం పట్టు.. తమిళనాడులో బీజేపీ కొత్త వ్యూహం
దిశ, వెబ్‌డెస్క్: తమ మీద ఉత్తరాది పార్టీ మరకను తుడిపేసుకోవడంతో పాటు ఈసారి తమిళనాట ఎలాగైనా కాలు మోపాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నది. అదికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 20 స్థానాల్లో పోటీకి దిగుతున్న కమలనాథులు.. ఇటీవలే బీజేపీ తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో హామీల వర్షం కురిపించారు. ఇందులో ప్రధానంగా.. జల్లికట్టు ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.
జల్లికట్టు.. తమిళనాడులో ఈ ఆట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై నిషేధం విధించాలని చూసిన కేంద్ర, రాష్ట్ర పాలకులకు అక్కడి ప్రజలు ఆందోళనలతో ముచ్చెమటలు పట్టించారు. జల్లికట్టు అనేది ఒక ఆట కంటే వారి సంస్కృతిలో భాగమని నమ్ముతారు తమిళులు. అందుకే దానిపై నిషేధం విధించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.
తమిళనాట ఎంతో పాపులర్ అయిన ఈ ఆటను ఆడేందుకు వందలాది మంది యువత ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు వాళ్లందరినీ తమ వైపునకు మళ్లించాలని చూస్తున్నది బీజేపీ. అందులో భాగంగానే తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే జల్లికట్టు ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. జల్లికట్టుతో పాటు తమిళనాట ప్రముఖ ప్రాచీన క్రీడలైన లోకల్ మార్షల్ ఆర్ట్స్, సిలంబం (కర్రతో చేసే విన్యాసాలు) వంటి వాటికి జాతీయ గుర్తింపునిస్తామని తెలిపింది. మరి బీజేపీకి ఇది ఎంతవరకు లాభిస్తుందనేది తెలియాలంటే మరో నెలన్నర రోజుల పాటు వేచి చూడాల్సిందే.