డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వాట్లింగ్ రిటైర్

by Sujitha Rachapalli |   ( Updated:2021-05-12 10:00:01.0  )
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వాట్లింగ్ రిటైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ఇండియా, న్యూజీలాండ్ మధ్య జూన్ 18 నుంచి 22 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తాను అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు న్యూజీలాండ్ జట్టు వికెట్ కీపర్ జేబీ వాట్లింగ్ బుధవారం ప్రకటించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడనున్నది. కాగా, జేబీ వాట్లింగ్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన వాట్లింగ్.. కివీస్ జట్టు టెస్ట్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా పలు రికార్డులు సృష్టించాడు.

“టెస్టు క్రికెట్ మంచి ఉన్నత స్థితిలో ఉన్నది. ఈ ఆటలో ప్రతీ క్షణాన్ని తాను ఆస్వాదించాను. ఛేంజింగ్ రూమ్స్‌లో సహచరులతో కూర్చొని బాతాకానీ కొడుతూ, బీర్లు తాగుతూ చాలా ఎంజాయ్ చేశాను” అని వాట్లింగ్ అన్నాడు. న్యూజీలాండ్ తరపున అత్యధిక అవుట్స్ చేసిన వికెట్ కీపర్, అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కివీస్ వికెట్ కీపర్ కూడా వాట్లింగ్ పేరిటే ఉన్నది.

Advertisement

Next Story