- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా దెబ్బకు పెరిగిన బిర్యానీ ఆర్డర్లు..!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా ఫుడ్ డెలివరీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోవడం, రెస్టారెంట్లు మూసేయడమే దీనికి కారణం. ఈ క్రమంలో భారత్‌లో చికెన్ బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేశారని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. మంగళవారం వెల్లడించిన భారత ఇష్టమైన ఆహారం గురించిన వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితమైన ఆహారప్రియులు సెకను ఒకటి కంటే ఎక్కువ చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది.
అంతేకాకుండా, ఈ కాలంలో సుమారు 3 లక్షల మంది కొత్త వినియోగదారులు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారని పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసరం కోసం మాత్రమే సడలింపు ఇవ్వడంతో ఫుడ్ డెలివరీలకు డిమాండ్ భారీగా పెరిగిందని, చికెన్ బిర్యానీ దేశంలో అత్యంత ఇష్టమైన వంటకమని స్విగ్గీ తెలిపింది. దీని తర్వాత పన్నీర్ బటర్ మసాలా, మసాల దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ వంటకాలు భారత్‌లో ఎక్కువగా ఆర్డర్లు జరిగాయి. ఇక, లాక్‌డౌన్తర్వాత 2 లక్షల పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది.