మెగాస్టార్‌కు ‘జాంబీ రెడ్డి’ విషెస్

by Shyam |
మెగాస్టార్‌కు ‘జాంబీ రెడ్డి’ విషెస్
X

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి.. మరెన్నో జీవితాలకు ప్రేరణ. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎందరికో ప్రాణదానం చేసిన మహానుభావుడు. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది జాంబీ రెడ్డి మూవీ యూనిట్.

ఒక జనరేషన్ ఫ్యాన్స్, ఫిల్మ్ మేకర్స్‌ను ఇన్ స్పైర్ చేసిన వ్యక్తి.. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహామనిషి మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ..చిరంజీవి నటించిన దొంగ సినిమాలోని కాష్మోరా కౌగిలిస్తే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మోషన్ పోస్టర్ విడుదల చేసింది. వీర హనుమాన్ నాట్యమండలి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

Advertisement

Next Story