ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి పూరీ బర్త్‌డే విషెస్

by Shyam |
ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి పూరీ బర్త్‌డే విషెస్
X

దిశ, వెబ్ డెస్క్ :
‘నీతోడు కావాలి’ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే ఛార్మి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ఆశించిన విజయాలు దక్కకపోయినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన ‘మంత్ర’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఛార్మి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గటంతో ప్రొడ్యూసర్ అవతారమెత్తిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది పూరీ డైరెక్షన్‌లో రామ్‌తో నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇదిలా ఉంటే, ఛార్మి ఈ రోజు(ఆదివారం) 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఛార్మికి టాలీవుడ్ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్.. ‘నా ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. నీ లైఫ్ జర్నీ అంత ఈజీగా ముందుకు సాగ‌లేదు. అయితే నువ్వెంత ‘స్ట్రాంగ్ పర్సనో’ నాకు తెలుసు. మ‌నం క‌లిసి ఇంకా ప్రయాణించాలి. నువ్వు న‌న్ను గ‌ర్వపడేలా చేశావు. పూరీ క‌నెక్ట్స్‌కు నువ్వే అస‌లైన బ‌లం. నీకు మరిన్ని విజ‌యాలతో పాటు నువ్వు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. లెట్స్ రాక్ అండ్ రాక్ అండ్ రోల్ మోర్’ అంటూ ట్వీట్ చేశారు .

‘హ్యపీయెస్ట్ బర్త్ డే ఛార్మి. నీ హార్డ్ వర్క్, నీవు చూపించిన ప్రేమ వల్లే ఇస్మార్ట్ శంకర్ అంతపెద్ద విజయం సాధించింది. పెద్ద పార్టీ కావాలి. గుర్తుందా.. లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేశాం’ అంటూ నభా నటేష్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story