బర్త్ డే స్పెషల్.. జననాంగాల కేక్!

by Anukaran |
బర్త్ డే స్పెషల్.. జననాంగాల కేక్!
X

దిశ, వెబ్‌డెస్క్ : వినూత్నంగా ఆలోచించడం మంచిదే. కానీ అది అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటేనే ప్రజలు మెచ్చుకుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా.. సీన్ రివర్స్ కావడం ఖాయం. సరిగ్గా అదే జరిగింది ఓ మహిళ చెఫ్ విషయంలో.

ఈజిఫ్టు రాజధాని కైరోలోని రెస్టారెంట్‌లో ఓ మహిళ చెఫ్‌గా పని చేస్తుంది. ఆమె కేకుల తయారీలో సిద్ధహస్తురాలు. బర్త్ డే కేక్ వినూత్నంగా ఉండాలని ఆ దేశంలో నిషేధించిన పదార్థాలతో కేక్‌ను తయారీ చేసింది. కానీ ఆ కేక్‌ను చూసిన ప్రజలు ఆమెను తీవ్రంగా విమర్శించారు. దేశ చట్టాలకు వ్యతిరేఖంగా ఆమె కేక్‌ను తయారు చేసిందని మండిపడ్డారు. పోలీసులు సైతం ఆమెను అరెస్ట్ చేసి 300 డాలర్ల జరిమానా వేశారు.

ఇంతకూ ఆమె కేక్ ఎందుకు వివాదస్పదం అయిందంటే.. కేక్‌ను స్త్రీ, పురుష జననాంగాలు రూపాలతోపాటు వివిధ అసభ్యకర ఆకారాల్లో తయారు చేసింది. ఆ కేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆమెపై ఫైర్ అయ్యారు. ముస్లిం దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండడంతో పోలీసులు ఆమెను కటకటల్లోకి నెట్టారు.

Advertisement

Next Story