సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌.. హీరో ఎవరంటే..?

by Anukaran |   ( Updated:2021-07-02 02:53:51.0  )
సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌.. హీరో ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురి సినీ, రాజకీయ ప్రముఖుకుల జీవిత చరిత్రలను దర్శకులు ఎంతో అందంగా ఆవిష్కరించారు. ఇక తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ‘యాత్ర’ సినిమాతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించిన మహి. వి.రాఘవ్ ‘యాత్ర 2’ పేరుతో జగన్ బయోపిక్ ని తెరకెక్కించనున్నాడు.

వైఎస్ జగన్ బయోపిక్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తారని వార్తలు గుప్పుమన్నాయి. సూర్యతో పాటు మరో సినిమాలో జగన్ గా నటించిన నటుడు అజ్మల్ ని కూడా తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే చిట్టచివరికి జగన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ తో ప్రతీక్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అంతేకాకుండా వైఎస్ జగన్ కు, ప్రతీక్ కు దగ్గర పోలికలు ఉండడంతో దర్శకుడు మహి ఆయననే సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ బయోపిక్ లో తెలుగు రాష్ట్రాల్లో మాస్ లీడర్‌గా వైఎస్ జగన్ ఎదిగిన తీరు, పార్టీని నెలకొల్పిన 10 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన ప్రయాణం, సీఎంగా ఆయన ప్రస్థానం వంటి అంశాలను చూపించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

Next Story