- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బయో ఏషియా ఎడిషన్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యుద్ధమే చేసిందని, ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల ప్లాట్ ఫారంపై రావడం వల్ల సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాల ద్వారా ఎన్నో అవకాశాలు లభిస్తాయని, అనేక సవాళ్లకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానంగా లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. బయో ఏషియా 18వ ఎడిషన్ వచ్చే నెల 22, 23 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు వెబ్ సైట్ ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. ‘మూవ్ ద నిడిల్’ అనే థీమ్ తో బయో ఏషియా 2021 లోగోను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ అండ్ బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Advertisement
Next Story