- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసోం ఎన్నికల బరిలో కోటీశ్వరులు
గువహతి: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నవారిలో పెద్దసంఖ్యలో కోటీశ్వరులు ఉన్నారు. 126 అసెంబ్లీ నియోజకవర్గాలున్న అసోంలో 946 మంది అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. వీరిలో 264 మంది కోటీశ్వరులే (27.90 శాతం) కావడం గమనార్హం. జాబితాలో యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) తరఫున పోటీ చేస్తున్న మనరంజన్ బ్రహ్మ ఆస్తులు రూ. 268 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థి రాహుల్ రాయ్ (రూ. 136 కోట్లు), ఏఐయూడీఎఫ్ అభ్యర్థి సిరాజుద్దీన్ అజ్మల్ (రూ.111 కోట్లు) ఉన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు, ఎన్నికల తీరు తెన్నులపై విశ్లేషణ చేసే అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో తెలిపింది. దీని ప్రకారం.. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థుల ఆస్తులు కోటి రూపాయల కంటే ఎక్కువ. బీజేపీ నుంచి బరిలో ఉన్నవారిలో 60 మంది కోటీశ్వరులే. అస్సాం జాతీయ పరిషత్ నుంచి 31 మంది, అసోం గణ పరిషత్ నుంచి 22 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ కోటి రూపాయల పైమాటే. మొత్తంగా చూస్తే 72 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ రూ. 5 కోట్ల కంటే ఎక్కువ కాగా 91 మంది రూ. 2 కోట్ల కంటే అధిక ఆస్తులు కలిగి ఉన్నారు.