ప్రధాని మోదీకి.. బిల్ గేట్స్ లేఖ

by vinod kumar |
ప్రధాని మోదీకి.. బిల్ గేట్స్ లేఖ
X

కరోనా కట్టడిలో భారత్ చేస్తున్న కృషిని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు భారత్‌లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. హాట్ స్పాట్ల గుర్తింపు, వైరస్ సోకిన బాధితులను ఐసోలేషన్ తరలించడం, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు పంపడం వంటి చర్యలు భారత్‌లో కరోనా అరికట్టడంలో కీలక పాత్ర షోషించాయన్నారు. ‘‘ఆరోగ్య సేతు’’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Tags: bill gates, pm modi, letter, carona, lockdown

Advertisement

Next Story