- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఇలాంటి వైరస్‌లు శతాబ్దానికి ఒక్కసారే వస్తాయి!'
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా అన్ని దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధని, శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి అని బిల్‌గేట్స్ చెప్పారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ధనిక దేశాలన్నీ కలిసి పేద, మధ్యతరగతి దేశాలకు సాయం అందించాల్సిన అవసరముందని గేట్స్ కోరారు. ఈ అంశం గురించి న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఏడిటోరియల్‌లో ప్రస్తావించిన గేట్స్, ప్రపంచ దేశాలన్నీ దౌత్య పరమైన ప్రయత్నాలు మొదలుపెట్టాలని అన్నారు.
ప్రపంచ దేశాలు మందులు, వ్యాక్సిన్లపై మరింత ఖర్చు పెట్టాలని వ్యాసంలో రాసుకొచ్చారు. గతంలో వచ్చిన వైరస్‌లన్నిటికంటే కరోనా ప్రభావం అత్యధికంగా ఉందని, దీన్ని అరికట్టేందుకు పేద దేశాలకు వైద్య, సాంకేతిక పరమనైన సాయం చేయాలని అన్నారు. పేద, మధ్యతరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి కాబట్టి అటువంటి దేశాలపై కరోనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందన్నారు. దీనికోసం వైరస్ వ్యాప్తిని అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడదామని గేట్స్ కథనంలో వివరించారు.
చైనాలో మొదలై, మొత్తం 46 దేశాలకు పాకిన కరోనా మహమ్మారి తీవ్రమైన ప్రాణ నష్టాన్ని కలిగించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లను బెంబెలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధిపై పోరాటం చేయడానికి బిల్‌గేట్స్ తన వంతు సాయంగా బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్ తరపున 100 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.