వావ్ వాట్ ఏ లాజిక్.. మిర్చి పొలంలో వెరైటీ దిష్టి బొమ్మ..

by Shyam |   ( Updated:2021-11-23 01:54:40.0  )
వావ్ వాట్ ఏ లాజిక్.. మిర్చి పొలంలో వెరైటీ దిష్టి బొమ్మ..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : టెక్నాలజీ పెరుగుతూ ఉండటంతో ఫ్లెక్సీలు మిరపతోటల్లో కూడా దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామ శివారు మంచా తండాలో బోడ బాలు అనే రైతు మిర్చి సాగు చేస్తున్నాడు. తన తోటకు దిష్టి తాకొద్దని, కోతులు, పక్షులు వచ్చి పంట నష్టం చేయొద్దని కాపలాకు ఇన్నోవేటివ్ గా ఆలోచించాడు.

దాంతో పొలంలో ఏకంగా బికినీ డ్రెస్ తో ఉన్న ఫారిన్ అమ్మాయి ఫ్లెక్సీ పెట్టాడు. ఫ్లెక్సీ పెట్టడమే కాక ఆ ఫ్లెక్సీ చివర్లో ఐ లవ్ యూ అని రాసిపెట్టాడు. మహబూబాబాద్ నుంచి కేసముద్రం వెళ్లే మెయిన్ రోడ్ కి పక్కనే తోట ఉండటంతో, అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులకు ఆశ్చర్యాన్ని, వినోదాన్ని కలిగిస్తోంది.

కరీనా పెళ్లిలో మలైకా అలా చేస్తుందనుకోలేదు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..

Advertisement

Next Story