- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో.. రూ.28 వేలు ఫైన్
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం, వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి మురిసిపోవడం చాలామంది సరదా. కానీ అలాంటి సరదాల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో.. పోలీసులు కూడా దీనిని బాగా వాడుకుంటున్నారు. దొంగలను పట్టుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని కూడా టెక్నాలజీతో సులువుగా పట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.
రోడ్డు మీద బైక్‌పై స్టంట్లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇద్దరు యువతులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన యూపీలోకి ఘజీయాబాద్‌లో చోటుచేసుకుంది. శివంగి డబ్బాస్, రెజ్లర్ స్నేహ రఘువంశీ ఘజీయాబాద్‌లో రోడ్డుపై బైక్‌పై స్టంట్లు చేశారు. రెజ్లర్ రఘువంశీ బైక్ నడుపుతుండగా.. శివంగి డబ్బాస్ ఆమె మెడపై కూర్చోని ఉంది.
ఈ వీడియోను శివంగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది బాగా వైరల్ అయి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రఘువంశీ తల్లికి రూ.11 వేల చలానా, బైక్ యజమాని అయిన సంజయ్ కుమార్‌కి రూ.17 వేల చలానా పంపారు.
https://www.instagram.com/p/CMcRYa_DtEo/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
శనివారం తానుఈ వీడియోను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశానని, అది వైరల్ అయి పోలీసుల చేతికి చిక్కామని శివంగి తెలిపింది.