గజ్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

by Sumithra |   ( Updated:2021-12-13 04:00:07.0  )
accident
X

దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన గ్యార వంశీ( 20) గజ్వేల్‌లో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ రాములు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడైన వంశీ గజ్వేల్‌లో కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కూరగాయల కోసమని రాత్రిపూట వెళ్లగా వెనక నుండి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లగా వంశీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వంశీ మృతదేహాన్ని తీసుకు రావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తమ కుమారుడిని విగత జీవిగా చూడటంతో కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story