బిహార్ మంత్రి వినోద్ కుమార్ కన్నుమూత

by Shamantha N |
బిహార్ మంత్రి వినోద్ కుమార్ కన్నుమూత
X

దిశ, వెబ్‎డెస్క్: బిహార్ మంత్రి, బీజేపీ నేత వినోద్ కుమార్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యం కారణంతో బాధ పడుతున్న ఆయన.. ఢిల్లీలోని మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా, మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వినోద్ కుమార్ సింగ్ స్థానమైన ప్రాన్‎పూర్ నుంచి ఆయన భార్య నిషా సింగ్‎ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

1995లో వినోద్ కుమార్ ప్రాన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి మహేంద్ర నారాయణ్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2005లోనూ ఓటమి పాలయినప్పటికీ 2010, 2015 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed