- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ సర్కార్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు సాయం చేయనున్నది. అమరులైన జవాన్లలో రాష్ట్రానికి చెందిన జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈనెల 15న చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు ఇంటి స్థలం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే.
Next Story