బిహార్ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్

by Shamantha N |
బిహార్ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపు మీద ఉన్న తరుణంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం పాట్నాలోని ఎయిమ్స్‌లో చేరారు. అన్ని ప్యారామీటర్లు సాధారణంగా ఉన్నాయని, గతరెండు రోజులుగా స్వల్పంగా జ్వరం వచ్చినట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఊపిరితిత్తుల సీటీ స్కాన్‌ రిపోర్ట్ నార్మల్‌గా వచ్చిందని, మెరుగైన పర్యవేక్షణ కోసం పాట్నాలోని ఎయిమ్స్‌లో చేరినట్టు వివరించారు.

ఎన్నికల క్యాంపెయిన్‌కు త్వరలో తిరిగివస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్న సందర్భంలో డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. ఊపిరిసల్పని షెడ్యూళ్లతో ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సుశీల్ కుమార్ మోడీ గత ఆదివారం సీఎం నితీష్ కుమార్‌తో ఓ వేదికను పంచుకోవడం గమనార్హం.

Advertisement

Next Story