నేడు బిహార్ సీఎం ఎన్నిక..

by Shamantha N |
నేడు బిహార్ సీఎం ఎన్నిక..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‌బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘనవిజ‌యాన్ని సొంతం చేసుకున్న ఎన్డీయే కూట‌మి ఆదివారం స‌మావేశం కానుంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు కూట‌మిలోని భాగ‌స్వామ్య‌ప‌క్ష ఎమ్మెల్యేలు ప‌ట్నాలో స‌మావేశం కానున్నారు.దీనికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహంచనున్నారు. అనంతరం శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌గా జేడీయూ నేత నితీశ్ కుమార్‌ను మ‌రోమారు ఎన్నుకోనున్నారు.

బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా, ఎన్డీయే కూటమి (బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు) 125 స్థానాలు సాధించాయి. ఇందులో అత్య‌ధికంగా 74 సీట్ల‌లో విజ‌యం సాధించిన బీజేపీ పార్టీ కూటమిలోనే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. మిగిలిన పార్టీలు జేడీయూ 43 స్థానాల్లో, వీఐపీ 4, హెచ్ఏఎం 4 సీట్ల చొప్పున గెలుపొందాయి. దీంతో త‌మ‌కంటే త‌క్కువ స్థానాల్లో గెలుపొందిన‌ప్ప‌టికీ నితీశ్ కుమార్‌కే మారోమారు సీఎంగా అవ‌కాశం కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈనేప‌థ్యంలోనే నేటి సమావేశంలో ఎన్డీయే కూట‌మి ఎమ్మెల్యేలు నితీశ్‌ను శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకోనున్నారు.

Advertisement

Next Story