బిహార్ సీఎంగా నితీష్ ఏకగ్రీవం..

by Anukaran |
బిహార్ సీఎంగా నితీష్ ఏకగ్రీవం..
X

దిశ, వెబ్‌డెస్క్ : బిహార్ శాసనసభాపక్ష నేతగా జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను కొద్దిసేపటి కిందటే ఏన్డీయే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఏన్డీయూ కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం పాట్నాలో సమావేశమయ్యారు.అనంతరం బిహార్ సీఎం అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో 125 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్‌కు మద్దతు పలికారు.

దీంతో నాలుగోసారి బిహార్ సీఎంగా నితీష్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో నితీష్ తన మద్దుతు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed