- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సీఎం’ను చెయ్యమన్న తప్పేముంది.. విన్నర్ ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి రిలీజైన విషయం తెలిసిందే. ప్రశాంత్ విన్నరై బయటకు వచ్చిన తర్వాత జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు విద్వాంసం సృష్టించారు. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత తనకు వచ్చిన ప్రైజ్ మనీతో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటానని చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తనని సీఎంని చేస్తే మల్లన్న సాగర్ పరిసర ప్రాంతంలో ఉన్న 14 గ్రామాల వారిని ఆదుకుంటానంటూ ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. దీంతో నెట్టింట ప్రశాంత్‌ను ట్రోల్స్ చేశారు.
అయితే.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ప్రశాంత్.. ‘అవును.. సీఎంని చేయండని అన్నాను. ఎందుకంటే.. ఓ రిపోర్టర్ అన్న వచ్చి మీ పక్కనే 14 గ్రామాలు ఉన్నాయి కదా. ఆ గ్రామాలకు ఏం చేస్తావ్ అని అన్నారు. నాకు వచ్చిందే రూ. 35 లక్షలు. అవి 14 గ్రామాలకు సాయం చేయడానికి ఎలా సరిపోతాయి. అదేమన్నా ఫలహారమా కొంచెం కొంచెం పంచడానికి. అందుకే ఆ డబ్బు సరిపోదు కాబట్టే.. నన్ను సీఎంని చేయండి.. ఆ గ్రామాలను ఆదుకుంటానని అన్నాను. అది తప్పా..? దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఇప్పటికీ గుండెలపై చేయి వేసుకుని చెప్తున్న.. బిగ్ బాస్‌లో నాకు వచ్చిన ప్రతీ రూపాయి రైతులకే ఖర్చు పెడతా. అది వీడియో తీసి లెక్కలతో సహా మీ అందరికీ చూపిస్తా. నేను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లింది నాకోసం కాదు. రైతుల కోసం. నా నేల తల్లి సాక్షిగా.. నా పంటచేను సాక్షిగా చెప్తున్నా నాకు ఒక్క రుపాయి వద్దు. ప్రతీ రూపాయి రైతులకే ఖర్చు చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.