- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 7 Telugu : చెంప చెల్లుమనిపించే విజయం.. పవర్ అస్త్రాను గెలిచిన ప్రశాంత్
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‍మేట్ అయ్యేందుకు కంటెస్టెంట్లు నానా తిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగా నాలుగవ పవర్ అస్త్రాతో పాటు వచ్చే రెండు వారాల ఇమ్యూనిటీ కోసం యావర్, ప్రశాంత్, శుభ శ్రీ మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్. పవర్ అస్త్రాను వదలకుండా ముగ్గురిలో ఎవరు పట్టుకుంటారో వారికి హౌస్‌మేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. దీనికి శివాజీ పర్యవేక్షకుడిగా వ్యవహరించగా, వారు ముగ్గురు పవర్ అస్త్రాను గంటల తరబడి అలాగే పట్టుకుని ఉన్నారు. అయితే ఈ సందర్భంగా రతిక, అమర్ దీప్ కలిసి పల్లవి ప్రశాంత్‌ను బాగా డిస్టర్బ్ చేశారు. అయినా అతడు పవర్ అస్త్రాను మాత్రం వదిలిపెట్టలేదు. ఇలా సమయం ఎక్కువ అవుతుండటంతో బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు. మూడు స్టిక్స్ పెట్టి.. వాటికి చివరలో పవర్ అస్త్రాను నిలువుగా పెట్టాలని, ఎక్కువ సేపు ఎవరు ఆపుతారో వారు నాలుగో హౌస్‌మేట్ అవుతారని చెప్పాడు. దీంతో యావర్, ప్రశాంత్, శుభ శ్రీ కాన్ఫిడెంట్‍గా ఆట మొదలుపెట్టారు. కానీ ఎక్కువ సేపు నిలువలేదు. మొదట యావర్ పవర్ అస్త్రా, తర్వాత శుభ శ్రీ పవర్ అస్త్రా కింద పడిపోయాయి. చివరకు ప్రశాంత్ పవర్ అస్త్రాను కింద పడకుండా కాపాడి గెలిచాడు. దీంతో అతను నాలుగో హౌస్‌మేట్ అయ్యాడు. అందరూ ప్రశాంత్‌ని మెచ్చుకున్నప్పటికీ రతిక, అమర్ దీప్, ప్రియాంక మాత్రం దీనిని జీర్ణించుకోలేక పోయారు. దీంతో ‘ఈ ముగ్గురికి ఎక్కడో మండుతున్నట్టుంది’ అనే మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.