- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గేమ్ ఆడూ మనుషులతో ఆడుకోకు.. లేడీ కంటెస్టంట్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 ప్రారంభమై ఇప్పటికీ మూడు వారాలు గడిచాయి. ఎలిమినేషన్స్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే గతంలో మాదిరిగానే హౌస్‌లో లవ్ ట్రాక్‌లు నడుస్తోన్నది చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఓ వైపు గౌతమ్, శుభ శ్రీ మరో వైపు ప్రిన్స్ యావర్, రతికల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. ఇదంతా నాగార్జున ప్రత్యేక్షంగా చూశారు. గత రెండ్రోజులుగా రతిక, యావర్‌లు కొత్తగా లవ్ డ్రామా మొదలు పెట్టారు. దీంతో హౌస్‌మెట్స్ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ త్వరలో అంటూ వారిని ఆడపట్టించారు. మరోవైపు ప్రశాంత్, ప్రిన్స్‌ను ప్రోత్సహించడం స్టార్ట్ చేశాడు.
గత వారం ఆడియన్స్ ఇచ్చిన మార్క్స్‌ను నాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సారి నాగార్జుననే స్వయంగా కంటెస్టెంట్లపై తనకున్న ఓపినియన్‌ను వెల్లడించారు. యావర్, ప్రశాంత్, శుభ శ్రీ ఇలా ఒక్కొక్కరి గురించి చెబుతూ.. రతికను.. ‘ఒక టీంలో ఆడుతున్నప్పుడు టీమ్ గేమ్ ఆడాలి. ఇది చెస్ గేమ్ కాదు. టీం గేమ్ ఉన్నప్పుడే గెలుస్తావ్. బఫ్ఫూన్ అన్నావంటే టీం వాళ్లంతా జోకర్సా? అని రతికను ప్రశ్నించాడు నాగ్. ఆట ఆడమ్మా మనుషులతో ఆడుకోవద్దు. నా మాటలు నీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను’ అంటూ నాగార్జున రతికను హెచ్చరించాడు. దీంతో రతిక అవును సార్ అర్థమయ్యింది. అంటూ స్మైల్ ఇస్తూ బదులిచ్చింది.