వైరల్‌గా మారిన పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటో.. ఆయన తండ్రి ఏమన్నారంటే!

by Hamsa |   ( Updated:2023-10-17 09:13:43.0  )
వైరల్‌గా మారిన పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటో.. ఆయన తండ్రి ఏమన్నారంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డగా సోషల్ మీడియాలో ఫేమస్ అయి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ రైతు బిడ్డ అని అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడని ఫైర్ అయ్యారు. కానీ ఫిజికల్ టాస్క్ లు వంటివి అతను బలంగా ఆడుతూ ఆ విమర్శలకు చెక్ పెట్టాడు. దీంతో అతను బాగానే పికప్ అయ్యాడు అని అంతా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఇతను చోటు సంపాదించుకోవడం ఖాయం అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా, పల్లవి ప్రశాంత్‌కు పెళ్లి అయినట్లు ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. మరోపక్క అతనికి కోట్ల ఆస్తి ఉంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వీటి పై క్లారిటీ ఇచ్చారు. ‘‘మేము కోటీశ్వరులు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మా అబ్బాయి హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాము’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో వైరల్ అవుతున్న పెళ్లి ఫొటో ఏదో వెబ్‌సిరీస్‌కో, లేక వీడియో కోసమో తీసుకున్నట్లు అర్థమవుతోంది.



Advertisement

Next Story

Most Viewed