నయని పావని ఎలిమినేషన్.. బిగ్‌బాస్‌పై కేసు వేయాలంటూ నటుడు అర్జున్ కల్యాణ్ సంచలన పోస్ట్..

by Hamsa |   ( Updated:2023-10-18 05:01:14.0  )
నయని పావని ఎలిమినేషన్.. బిగ్‌బాస్‌పై కేసు వేయాలంటూ నటుడు అర్జున్ కల్యాణ్ సంచలన పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ షో సీజన్-7 చాలా ఆసక్తికరంగా ప్రసారమవుతోంది. ఆరో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అమర్ దీప్, ప్రిన్స్ యావర్,తేజా, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. వీరు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. చివరికి అశ్వినీ శ్రీ, నయని పావనిని సీక్రెట్ రూమ్ కి ఇద్దరినీ పిలిచిన నాగార్జున నయని పావని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.

తాజాగా, నయని పావని కంటెస్టెంట్ ఎలిమినేషన్‌పై మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశాడు. ‘‘నయని పావని పట్ల చాలా బాధగా ఉంది. ఆమె ఒక్క వారంలో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ కాదు. ఆమె గేమ్ బాగా ఆడుతుంది. ఓటింగ్‌కి ఎలిమినేషన్‌కి సంబంధం లేదని ఇప్పుడు జనాలకు అర్థమైంది. ఓటింగ్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎవరైనా ఈ విషయంపై కేసు వేస్తే బాగుండు’’ అంటూ ట్వీట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Next Story