Big Boss : అమ్మో.. నీ దగ్గరకు రాను.. నన్ను ఏదేదో చేస్తావ్.. అర్జున్‌పై లేడీ కంటెస్టెంట్‌తో బోల్డ్‌ కామెంట్స్ (వీడియో)

by Anjali |   ( Updated:2023-10-22 14:06:30.0  )
Big Boss : అమ్మో.. నీ దగ్గరకు రాను.. నన్ను ఏదేదో చేస్తావ్.. అర్జున్‌పై లేడీ కంటెస్టెంట్‌తో బోల్డ్‌ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల్లోనూ ఈ షోలు నిర్వహిస్తున్నారు. ఈ షోలపై కొందరు పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా.. మరి కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు బిగ్‌బాస్‌ షోపై చాలామంది అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. సీపీఐ పార్టీకి చెందిన నారాయణ అనే నేత ఏకంగా ‘అదొక బ్రోతల్ హౌజ్’ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన కామెంట్లపై సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్ధించగా.. మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇటీవల బిగ్‌బాస్‌ హౌజ్‌లో జరిగిన చర్చ నెట్టింట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. కంటెస్టెంట్లు అశ్విని శ్రీ, అర్జున్ అంబటిల మధ్య జరిగిన సరదా అసభ్య చర్చపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఇందుకే సీపీఐ నారాయణ బిగ్‌బాస్‌ను బ్రోతల్ హౌజ్ అని కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed