Bigg Boss-7: పిచ్చి పట్టినట్టు రెచ్చిపోయిన శోభా.. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుత అంటూ కంట్రోల్ తప్పిన గౌతమ్

by sudharani |   ( Updated:2023-10-02 09:28:50.0  )
Bigg Boss-7: పిచ్చి పట్టినట్టు రెచ్చిపోయిన శోభా.. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుత అంటూ కంట్రోల్ తప్పిన గౌతమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకుల అంచనాలు మించి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కంటెస్టెంట్స్ మధ్య పోటీ, గొడవలతో బిగ్ బాస్ లవర్స్‌కు కావాల్సినంత కిక్ అందుతుంది. ఇక ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం పవర్ అస్త్ర సంపాదించుకునే అవకాశం, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌కు రాగా.. ప్రిన్స్ టాస్క్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఇద్దరి గురించి కన్ఫెషన్ రూమ్‌లో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని మిగిలిన కంటెస్టెంట్స్ చెప్పిన వీడియో బహిర్గతం చేశాడు బిగ్ బాస్. దీంతో హౌస్‌లో హీట్ మరోసారి మొదలైంది.

ఈ మేరకు బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో.. ‘‘మిగతా కంటెండర్స్ అయిన శోభా, అమర్ మీరు మూడో పవర్ అస్త్ర పొందేందుకు కంటెస్టెంట్స్ చెప్పే కారణాలను బిగ్ బాస్ మీరు చూపించాలి అనుకుంటున్నారు అంటూ.. వీరు అనర్హులు అని చెప్పిన వీడియో బహిర్గతం చేస్తాడు బిగ్ బాస్. దీంతో శోభ పవర్ అస్త్ర అనర్హురాలిగా గౌతమ్ చెప్పిన సమాధానం ఆమెకు నచ్చలేదు. ఇంకేముంది పిచ్చిపట్టిన దానికి హౌస్‌లో రచ్చ రచ్చ చేసింది. ‘నువ్వు చెప్పిన రీజన్ బక్వాస్ రీజన్’ అంటూ శోభా రెచ్చిపోవడంతో గౌతమ్ కూడా కంట్రోల్ తప్పి ‘‘నా బాడీ నా ఇష్టం.. పొద్దున్న ఎత్తుతా.. రాత్రి ఎత్తుతా..’ అంటూ శోభా ముందే డంబుల్స్ ఎత్తి పడేస్తున్నాడు. ఈ ప్రోమో మరింత ఉత్కంఠంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story