Bigg Boss-7: మీ సరసాలు తగలెయ్యా.. రతికా, యావర్‌పై చిరాకుపడ్డా ప్రశాంత్.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-10 15:51:21.0  )
Bigg Boss-7: మీ సరసాలు తగలెయ్యా.. రతికా, యావర్‌పై చిరాకుపడ్డా ప్రశాంత్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు బిగ్ బాస్ రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు మూడో వారంలోకి సక్సెస్‌పుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కంటస్టెంట్స్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు సందీప్, శివాజీ హౌస్ మేట్స్ కాగా.. ఈ వారం హౌస్ మేట్స్ అయ్యేందుకు ఒక్కోక్కరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ మూడో కంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌కి ఇచ్చాడు. ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రకు అర్హులు కాదో కన్ఫెషన్ రూమ్‌లో చెప్పాలని బిగ్ బాస్ ఆదేసిస్తాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ వెళ్లి ఒక్కొక్కరు ఒక్కరి పేరు చెబుతారు.

ఇక ప్రిన్స్.. రతిక నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు. సపోర్ట్ చేస్తాను అని చెప్పినట్టే చెప్పిన రతిక.. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం ప్రిన్స్ యావర్ అనర్హుడని చెప్పింది. కన్ఫెషన్ రూమ్‌లో ఎవరెవరు ఎవరి పేర్లు చెప్పారో బిగ్ బాస్ వీడియోలు బహిర్గతం చేస్తాడు. అప్పుడు రతిక యావర్ అనర్హుడు అని చెప్పడం చూసి.. యావర్‌తో పాటు అందరూ షాక్ అవుతారు. అయితే.. ఇంత మోసం జరిగిన యావర్, రతికతో ఎప్పటిలాగే మాట్లాడటం గమనార్హం. అంతే కాకుండా నీకు ఏమైనా నేనున్నా అంటూ హామీలు ఇస్తాడు. కిచెన్‌లో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరుగగా.. అది చూసిన పల్లవి ప్రశాంత్ మీ సరసాలు తగలెయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

Next Story

Most Viewed