Bigg Boss-7: ఈ వారం నామినేషన్‌లో మరింత హీట్.. ఒక్కొక్కరి కుండలు బద్దలయ్యాయిగా..

by sudharani |
Bigg Boss-7: ఈ వారం నామినేషన్‌లో మరింత హీట్.. ఒక్కొక్కరి కుండలు బద్దలయ్యాయిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఆరు వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (ఆదివారం) నయనీ పావని ఎలిమినేట్ కాగా.. ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. వారం వారం నామినేషన్‌లో హీట్ మాములుగా ఉండటం లేదు. ఇక ఈ వారం కూడా ఒకరి మధ్య ఒకరికి మాటల యుద్ధం ఓ రేంజ్‌లో మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. ఓ లుక్ వేసేద్దాం పదండి..

లాస్ట్ వారంలో ఆటగాళ్లు, పోటుగాళ్లు అని కంటెస్టెంట్స్‌లను రెండు భాగాలుగా చేసిన బిగ్ బాస్.. ఈ వారం అందరూ ఒకటే అంటూ చెప్పాడు. ఇక ఇంటిలో ఉండేందుకు అనర్హులు అని మీరు భావించిన ఇద్దరు కంటెస్టెంట్స్‌ల కుండలను బ్యాట్‌తో పగల గొట్టాల్సి వస్తుంది అని చెబుతాడు బిగ్ బాస్. ఇక స్టాటింగ్‌ లోనే పల్లవి ప్రశాంత్, సందీప్ మధ్య మాటల యుద్ధం షురు అవుతుంది.

ఆ తర్వాత అమర్ దీప్.. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన అశ్వినిని నామినేట్ చేస్తాడు. ఆమె మాత్రం అమర్ పేరు కాకుండా.. అమర్‌తో నేను అల అనలేదు ప్రశాంత్ అంటూ మాట్లాడుతుంది. ఇలా రెండు, మూడు సార్లు అనడంతో అమర్‌కు కోపం వచ్చి.. ప్రశాంత్ నువ్వు రారా ఇక్కడికి. నీతో తప్ప ఎవరితో మాట్లాడదు అనుకుంటా అంటూ బ్యాట్ కిందకి విసిరేస్తాడు. ఇలా హౌస్ మేట్స్ మధ్య హోరా హోరా యుద్ధం నెలకొంది. ఇక ప్రోమో లాస్ట్‌లో బిగ్ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. శివాజీని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాడు. దీందో హౌస్ మేట్స్ మొత్తం షాక్‌కు గురవుతారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed

    null